Friday, March 13, 2026
HomeTrending Newsలా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: బాబు లేఖ

లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది: బాబు లేఖ

Total Failure: రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందని, రాష్ట్ర ప్రజలకు భద్రత కరువైందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ పై వివరాలు ప్రస్తావించారు.  నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం చెందారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు చంద్రబాబు జత చేశారు.

పెట్రేగుతున్న వైసిపి గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలమవుతోందని ఆరోపించారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని లేఖలో  గుర్తు చేశారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదని, రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని చంద్రబాబు అభిప్రాపయపడ్డారు.

గంజాయి సరఫరాలో వైసిపి నేతల ప్రమేయం కనిపిస్తున్నా….పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు.  అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టిడిపి కార్యకర్తపై దాడి చెయ్యడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.  రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకపోయినా కర్నాటక పోలీసులు వైసిపి ఎంపిటిసిని అరెస్టు చేశారని లేఖలో వివరించారు.  రాష్ట్రం నుంచి డ్రగ్స్  అస్ట్రేలియాకు  తరలించిన కేసులో దర్యాప్తు సంస్థలు అక్కడికి వెళ్లి ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని వాపోయారు. నేరాల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు…లా అండ్ ఆర్డర్ అమలు పై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని డిజిపికి సూచించారు.

Also Read : దిశ చట్టం ఏమైంది? లోకేష్ ప్రశ్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular