Sunday, February 23, 2025
HomeTrending Newsపేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

పేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ జిల్లా గుర్హ ప్రాంతంలో ఇది జరిగింది. అఫ్సర్ ఖాన్ అనే వ్యక్తీ తన గ్రామం అమిరటి మినీ పాకిస్తాన్ అంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో కొద్ది రోజుల్లోనే అది వైరల్ అయింది.

అఫ్సర్ ఖాన్ ఉద్యోగ రిత్యా ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో చాలా కాలం పాటు ఉంది కొద్ది రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఇది జరిగిన నాటి నుంచి అఫ్సర్ పరారీలో ఉన్నాడు. ఇలాంటి వ్యవహారాలతో మత కలహాలు చెలరేగే ప్రమాదం ఉందని రేవా పోలీసులు తెలిపారు. ఐటి చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అనాలోచిత వ్యంగ్య వ్యాఖ్యలతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్