బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడమే కాకుండా.. హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఈ రోజు మరోసారి హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక్క రోజు రెండు పోలీస్ స్టేషన్స్ నుండి రాజా సింగ్ కు నోటీసులు వచ్చాయి. 41 crpc కింద షాహీనాథ్ గుంజ్, మంగల్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అయితే పోలీసుల నోటీసులపై ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తనపై తెలంగాణ పోలీసులు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ లో నమోదైన కేసుల పై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్ర పోతున్నారా అని రాజాసింగ్ నిలదీశారు.
Also Read : పాతబస్తీలో టెన్షన్ టెన్షన్