Saturday, July 27, 2024
HomeTrending Newsఝార్ఖండ్​ సీఎంకు షాక్​- అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు

ఝార్ఖండ్​ సీఎంకు షాక్​- అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు

ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.

ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్​ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం గవర్నర్ కోరారు. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని హేమంత్‌ సోరేన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సాయంత్రానికల్లా ఆయన కూడా రాంచి చేరుకోనున్నారు.

Also Read : హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్