Saturday, January 18, 2025
HomeTrending Newsకత్తి మహేష్ కంటికి శస్త్ర చికిత్స!

కత్తి మహేష్ కంటికి శస్త్ర చికిత్స!

ప్రముఖ రాజకీయ, సామాజిక, సినిమా విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం నెల్లూరు మెడికవర్ ఆస్పత్రి బులెటిన్ విడుదల చేయనుంది. మహేష్ ప్రయాణిస్తున్న వాహనం ఈ తెల్లవారుజామున నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అయన ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కంటికి కూడా గాయమైంది.

ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ కూడా కారులో ఉన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతోనే గాయపడ్డ వ్యక్తిని కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఆయన్ను నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్పెషల్ ఇసోలేషన్ వార్డులో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కంటికి శస్త్ర చికిత్స చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

కత్తి మహేష్ స్నేహితులు బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్