కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో రూపొందే ఈ పాన్ ఇండియా మూవీని దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ధనుష్ ఇప్పుడు మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఎవరితో అంటే.. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో అని టాక్ వినిపిస్తోంది. ప్రేమ కథలని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్. మరి ధనుష్ కోసం ఎలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన పూర్తి డీటెయిల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *