Friday, October 18, 2024
HomeTrending Newsబీజేపీ,టిఆర్ఎస్ ల పోలిటికల్ డ్రామా- రేవంత్

బీజేపీ,టిఆర్ఎస్ ల పోలిటికల్ డ్రామా- రేవంత్

Political Drama Of Bjp And Trs Rewanth Allegation : 

కేసీఆర్, బండి సంజయ్ ల ప్రెస్ మీట్ లు చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ ను తలపిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా..అరవింద్ ,బండి సంజయ్ లు ఎంధుకు నోరు విప్పడం లేదన్నారు. హైదరాబాద్ కొంపల్లి లో జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతుల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ ,టిఆర్ఎస్ లు పోలిటికల్ డ్రామా ఆడుతున్నాయన్నారు.

కేసీఆర్ అవినీతి ని బయటపెట్టే ధైర్యం మాకు ఉంది.. అమిత్ షా అపాయింట్ మెంట్ బండి సంజయ్ ఇప్పిస్తాడా అని రేవంత్ అన్నారు. నీళ్లు,నిధుల పేరుతో కేసీఆర్ కోట్ల అవినీతి కి పాల్పడ్డాడని, మోడీ ,అమిత్ షాలకు చిత్తశుద్ధి ఉంటె కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ కు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి కి నేను సవాల్ చేస్తున్నా..మీరు సీబీఐ ఎంక్వరీ వేయండి, కేసీఆర్ అవినీతి ని నేను నిరూపించకుంటె రాజకీయాల శాశ్వతంగా నుంచి తప్పుకుంటానని రేవంత్ ప్రకటించారు.

కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలించాడు. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ఖర్చు అంత కేసీఆర్ పెట్టుకున్నాడని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా యోగి ని మరోసారి చేసేందుకు కేసీఆర్ మోడీ తో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ mim చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డడు, గచ్చిబౌలి ,నార్సింగిలలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు,బెల్లంలా కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టాడన్నారు.

పవర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించినప్పుడు..నేను ఆధారాలు ఇస్తా అని చెప్పినా..ఇప్పుడు బీజేపీ  ఓబీసీ సెల్  జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్  ఎంధుకు విచారణ కోరడం లేదని రేవంత్ ప్రశ్నించారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని, నక్లెస్ రోడ్ లో సంజీవయ్య పార్క్ ను  మంత్రి తలసాని  ఆక్రమించిండు…విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీ కి ఉందా అన్నారు. ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న అమరవీరుల స్పూపంలో కూడా అవినీతి జరిగిందన్నారు. కెసిఆర్ మీద  ఉధ్యమం ఒక విప్లవం, ఒక త్యాగం, ఒక పోరాటం..గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేయండని రేవంత్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. భవిష్యత్ లో ఇంకా చాలా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, సోనియాగాంధీ ఆమోదిస్తే వచ్చే సంవత్సరం ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు.

Must Read : రేవంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్