Tuesday, April 16, 2024
HomeTrending Newsకెసిఆర్ జైలుకు పోవడం ఖాయం - పొన్నాల లక్ష్మయ్య

కెసిఆర్ జైలుకు పోవడం ఖాయం – పొన్నాల లక్ష్మయ్య

లిక్కర్ కేసులో భాగస్వాములు, అందులోని కంపెనీలు, ప్రధాన పాత్రధారులని వదిలేసి కొంతమందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిస్థితి కాదన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మ్నాత్రి పొన్నాల..  కెసిఆర్ పై కేసులు ఉన్నాయి జైలుకు పోవడం ఖాయమని 2014 లోనే చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ కేసులను పూర్తిస్థాయిలో విచారిస్తుంది…దోశులను జైలుకు పంపిస్తుందని అంటే నాపై నిప్పులు కక్కాడు కేసీఆర్ అన్నారు.

మీకు దమ్ము ధైర్యం ఉంటే సహారా, దొంగ పాస్పోర్ట్ ల కేసులకు సంబంధించి ఈడి విచారించినవి బయటికి విడుదల చేయాలని పొన్నాల అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడే ఈడీ సంస్థ హైదరాబాద్‌ వచ్చి ముఖ్యమంత్రిని ఇంటరాగేట్ చేసింది వాస్తవం కాదా అన్నారు.

నరేంద్ర మోడీ ,అమిత్‌ షా, నడ్డా తెలంగాణలో అవినీతి భయంకరంగా ఉందని, కేసీఆర్ అవినీతిపై మా దగ్గర అన్ని అధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారని, కాళేశ్వరం ఒక ఏటీఎం అని ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా అన్నారని, ఎందుకు కేసీఆర్ పై విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ఇద్దరూ తోడు దొంగలే అని మండిపడ్డారు.

మద్యం కుంభకోణంలో కవితకి 66శాతం, పిళ్లైకి 26% అని అంటున్నారు…26% ఉన్న వాళ్ళని విచారించి అరెస్టు చేసి….66% ఉన్న వాళ్ళని పక్కన పెట్టారని ఆరోపించారు. ఫామ్ హౌస్ కేసు ఏమైంది ఇప్పటి వరకు అది బయటికి ఎందుకు రావడం లేదన్నారు. దానిలో ఎవరున్నారు…దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న బిజెపి వాళ్లపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోలేదని, దొందూ దొందే ఇవి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే కార్యక్రమాలని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆధారాలు ఉండి కూడా విచారణ సంస్థకి ఇవ్వడం లేదు… ఆధారాలు ఉండి న్యాయ సంస్థకు మోడీ, అమిత్ షా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం దాటి అప్పులు చేసే వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్