Friday, March 20, 2026
HomeసినిమాPooja Hegde: సల్మాన్ జోడీగా మరింత అందంగా మెరిసిన పూజ హెగ్డే!

Pooja Hegde: సల్మాన్ జోడీగా మరింత అందంగా మెరిసిన పూజ హెగ్డే!

పూజ హెగ్డే .. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్. నాజూకుగా .. కోమలత్వానికి కేరాఫ్ అడ్రెస్ గా ఆమె  కనిపిస్తూ ఉంటుంది. అందం .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఆమెకి క్రేజ్ ఉంది. ‘రాధేశ్యామ్’.. ‘బీస్ట్’ వంటి పాన్ ఇండియా సినిమాలు, ‘ఆచార్య’ వంటి భారీ సినిమా ఆమెకి పరాజయాలనే అప్పగించాయి. చాలా తక్కువ గ్యాప్ లో పలకరించిన ఫ్లాపులకు మరొక హీరోయిన్ అయితే చాలా డీలాపడిపోవడం జరిగేది. కానీ పూజ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళుతోంది.

ఆమె తాజా చిత్రమైన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ నిన్న థియేటర్లకు వచ్చింది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు .. నిర్మాత కూడా. ఆయనకి గల క్రేజ్ గురించి .. మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను చేయడం వలన, తెలుగుదనం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాపై పూజ చాలానే ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఆమెకి చాలా అవసరం.

నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా టాక్ సంగతి అలా ఉంచితే, గతంలో కంటే ఈ సినిమాలో పూజ చాలా గ్లామరస్ గా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇంతకుముందు కాస్త సన్నగా అనిపించిన పూజ, ఈ సినిమాలో కరెక్ట్ ఫిజిక్ తో కట్టిపడేస్తుందని చెబుతున్నారు. నటన పరంగా .. డాన్సుల పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసిందని అంటున్నారు. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. సినిమా రిజల్ట్ సంగతి అలా ఉంచితే, పూజ తన మార్కులు తాను తెచ్చేసుకుందనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular