Saturday, June 13, 2026
HomeTrending Newsకంటోన్మెంట్ 5 రహదారుల్లో ప్రజల రాకపోకలకు అనుమతి

కంటోన్మెంట్ 5 రహదారుల్లో ప్రజల రాకపోకలకు అనుమతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.

‘సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రిచర్డ్‌సన్, ప్రోట్నీ, బయామ్, అమ్ముగూడ, అల్బయిన్ రోడ్లను సామాన్య ప్రజల రాకపోకల కోసం అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల శ్రీ రాజ్ నాథ్ సింగ్ కి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. పలుమార్లు ఈ అంశంపై వారిని కలిసి సమస్యను విన్నవించాను. రోడ్లను తెరిచేందుకు వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

‘జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాల విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. రాజ్‌నాథ్ సింగ్ ని కలిసిన సందర్భంలో.. కంటోన్మెంట్ ప్రాంతానికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బెదిరింపులు.. తదితర అంశాలను కూడా తెలియజేశాను‘అని కిషన్ రెడ్డి వెల్లడించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాజీవనాన్ని సౌలభ్యం చేసేందుకు కృషిచేస్తోందని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular