Sunday, January 19, 2025
Homeసినిమానాగ‌చైత‌న్య‌కు హీరోయిన్ ఎవరు?

నాగ‌చైత‌న్య‌కు హీరోయిన్ ఎవరు?

Update: ‘యువ‌త’ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే స‌క్సెస్ సాధించాడు ప‌ర‌శురామ్. రెండో సినిమాగా ర‌వితేజ‌తో ‘ఆంజ‌నేయులు’ చేసి మెప్పించాడు. ఆత‌ర్వాత సోలో, సారొచ్చారు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, గీత గోవిందం.. ఇలా స‌క్సెస్ సాధించిన ప‌ర‌శురామ్ ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ‘స‌ర్కారు వారి పాట’ అనే భారీ చిత్రం చేశారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టాక్ సొంతం చేసుకోవ‌డం విశేషం.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. స‌ర్కారు వారి పాట తర్వాత‌ నాగచైతన్యతో పరశురామ్ సినిమా ఉంటుంద‌నే టాక్ వచ్చింది. అయితే.. తాజా ఇంటర్ వ్యూలో.. పరశురామ్ మాట్లాడుతూ.. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఆ సినిమా క‌థ అంతా రెడీగానే ఉంది గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళతామని అన్నాడు. కమిట్ మెంట్ ప్రకారం పరశురామ్ మళ్లీ వెనక్కి వచ్చి చైతూతో సినిమా చేయడం విశేషమే. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న‌ కథానాయికలుగా పూజ హెగ్డే, రష్మికల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్ద‌రిలో ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేస్తారో..?  ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ప‌ర‌శురామ్ పై చైత‌న్య‌కు కోపం లేదా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్