నా వ్యాఖ్యలు వక్రీకరించారు: బాబు

Diversion: కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తాను పొత్తులపై మాట్లాడలేదని, ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలంతా కలిసి రావాలని, ప్రజా ఉద్యమం రావాలని మాత్రమే చెప్పానని బాబు వెల్లడించారు.  2024 ఎన్నికల్లో ఓడిపోతే ఇక వైసీపీ ఉండదని,  తన బలహీనతలను అధిగమించడానికే  ఇలాంటి దుర్మార్గపు, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ముఖ్య నేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పొత్తులపై మూడు రోజులగా రాష్ట్రంలో జరుగుతోన్న రాజకీయ చర్చపై అయన పలు వ్యాఖ్యలు చేశారు.  అంతా కలిసి కట్టుగా పని చేయాలని సూచించానని, కానీ దాన్ని పొత్తులకు ముడిపెట్టి మాట్లాడారని, 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలని, తరవాత సోదిలో కూడా ఉండబోదని అన్నారు.

Also Read : ఇంటింటికీ బాదుడే బాదుడు: బాబు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *