Saturday, January 18, 2025
Homeసినిమా‘అనుభవించు రాజా’ రెండో పాట విడుదల చేసిన పూజా హెగ్డే

‘అనుభవించు రాజా’ రెండో పాట విడుదల చేసిన పూజా హెగ్డే

pooja Hegde Released The Second Single From Anubhavinchu Raja :

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన‌ర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 26న ఈ సినిమా విడుదల చేస్తున్న‌ట్టుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

కింగ్ నాగార్జున ‘అనుభవించు రాజా’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక తాజాగా రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. కశిష్ ఖాన్ ఈ పాటలో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ పాటలో రాజ్ తరుణ్ మీదున్న తన ప్రేమను ఆమె తెలియజేస్తోంది.

ప్రేమలో పడ్డ క్షణాల్లో కలిగే ఫీలింగ్స్‌ ను ఈ పాట ద్వారా చెప్పబోతోన్నారు. గోపీ సుందర్ అందించిన ఈ బాణీకి భాస్కర భట్ల మంచి సాహిత్యాన్ని అందించగా.. రమ్య బెహర అద్భుతంగా పాడారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నాగేష్ బానెల్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read :

‘అనుభవించు రాజా’ టైటిల్ సాంగ్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్