Saturday, March 14, 2026
HomeTrending Newsపూంచ్ లో బస్సు ప్రమాదం..11 మంది మృతి

పూంచ్ లో బస్సు ప్రమాదం..11 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. దాదాపు 26 మంది గాయపడ్డారు.   పూంచ్ జిల్లాలోని సావ్జియాన్  నాలా వద్ద మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారిక వర్గాలు తెలిపాయి. సావ్జియాన్ నుంచి మండీ వెళుతుండగా ఈ దుర్గటన జరిగింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular