Sunday, November 24, 2024
HomeTrending Newsపద్మ భూషణ్ వాణి జయరాం కన్నుమూత

పద్మ భూషణ్ వాణి జయరాం కన్నుమూత

సుప్రసిద్ధ నేపథ్యగాయని వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు, అసలు పేరు కలై వాణి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. వివిధ భాషల్లో ఆమె పదివేలకు పైగా పాటలు పాడారు.  వివిధ కీర్తనలు కలిపి మొత్తంగా 20వేల పాటలు ఆమె మధుర కంఠం నుంచి జాలువారాయి.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొంతకాలంగా చెన్నైలోని  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.  కొద్దిసేపటి క్రితం  తన నివాసంలో ఆమె మరణించారు.  పదిరోజుల క్రితం రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆమెకు పద్మ భూషణ్ వరించింది. ఆ పురస్కారం స్వీకరించాకుండానే  ఆమె కన్నుమూయడం విషాదం. ఆమెకు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా ఐ-ధాత్రిలో వచ్చిన వ్యాసం ఇది…

వాణీ జయరాం గానం- పాటల బృందావనం

స్వాతి కిరణం సినిమాలో ఆమె గానం చేసిన పాటలు  ఎప్పటికీ తెలుగువారికి, సంగీతాభిమానులకు చిరస్మరణీయంగా నిలిచి పోతాయి. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కే. విశ్వనాథ్ మొన్న రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్