Monday, June 15, 2026
Homeసినిమావీర‌మ‌ల్లు అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

వీర‌మ‌ల్లు అప్ డేట్ ఇచ్చిన మేక‌ర్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎంర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. క‌రోనా, ప‌వ‌ర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీ అవ్వ‌డం లాంటి కారణాలతో ఆల‌స్యం అవుతూ వచ్చింది.  అయితే.. ఇప్పుడు వీర‌మ‌ల్లు నుంచి అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వీర‌మ‌ల్లు నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేక‌ర్స్.  హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ అంటూ ఆ మాసివ్ వీడియోని ఈ సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి.. సాలిడ్ యాక్షన్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read :  వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ ఫిక్స్. మ‌రి.. క‌లిసొస్తుందా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular