ప్రైవేట్ వ్యక్తుల చేతికి విద్యుత్ సంస్థలను అప్పజెప్పడమంటే ప్రజలకు ద్రోహం చేయడమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టంపై మంత్రి మండిడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో నేడు జరగబోయే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త విద్యుత్ చట్టం దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. విద్యుత్ రంగం ప్రైవటీకరణతో దేశ ప్రజల పై తీవ్ర దుష్పరిణామం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త విద్యుత్ చట్టంతో సమస్యలు విద్యుత్ ఉద్యోగులకే కాదు రైతులు, ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుంద. ఒక్కసారి విద్యుత్ నియంత్రణ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే ధరల నియంత్రణ ఉండదని ఆయన ఆదందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని కొంత మంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కొత్త విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులతో పాటు దేశంలోని ప్రగతిశీల శక్తులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తున్నాడు.సంస్కరణల పేరుతో ప్రజల జేబులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు.