Thursday, March 19, 2026
HomeTrending Newsకేంద్ర విధానాలతోనే విద్యుత్ కొరత

కేంద్ర విధానాలతోనే విద్యుత్ కొరత

రాష్ట్రంలో ఎలాంటి బొగ్గు కొరత,విద్యుత్ కోతలు లేవని,రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ అవదని, రెండు వందల ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి హైదరాబాద్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమేనని మంత్రి చెప్పారు. దీనిపై దేశాన్ని పాలిస్తున్న నేతలు సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ హైదరాబాద్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, మళ్ళీ హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని జగదీష్ రెడ్డి వివరించారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుందని, శ్రీశైలం, నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుందన్నారు. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా  చేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఇష్ట రీతి నిర్ణయాల వళ్ళ రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా కోతలు లేవు. ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే బోగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ దేశంలో విద్యుత్ కోతలని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కలరాయవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుమారక రానున్న రోజుల్లో పోతే తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular