యంగ్ టైగర్ ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత మ‌హేష్ కోనేరు ఈరోజు ఉద‌యం విశాఖ‌ప‌ట్నంలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఈ వార్త విని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సినీ పాత్రికేయ మిత్రులు షాక్ అయ్యారు. ఇప్ప‌టికీ ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నారు. జ‌ర్న‌లిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ల‌కు స‌న్నిహితంగా ఉంటూ వాళ్ల సినిమాల‌కు పీఆర్వోగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

ఆ త‌ర్వాత‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ సినిమాస్ బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా నందమూరి  క‌ల్యాణ్ రామ్ హీరోగా 118 అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా స‌క్స‌స్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన ‘మాస్ట‌ర్’ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా విజ‌యం సాధించింది. ఇంకా వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాత‌గా రాణిస్తూ.. కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయ‌న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డం బాధాక‌రం. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, మీడియా మిత్రులు ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *