Tuesday, March 10, 2026
Homeసినిమారాఘవేంద్రరావుకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన పవన్

రాఘవేంద్రరావుకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన పవన్

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తొలిసారి కెమెరా మెందుకు వస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతోన్న ‘పెళ్లిసందదD’ చిత్రంలో దర్శకేంద్రుడు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ తన స్పందనను ఇలా తెలియచేశారు.

శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి, నమస్సులు

తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు.

కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్… కెమెరా… యాక్షన్…’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో… ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు.

ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

విష్ యూ ఆల్ ద బెస్ట్.

…….అంటూ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular