టోక్యో ఒలింపిక్స్ లో మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం, ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి. వి. సింధు సెమీ ఫైనల్స్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ కు చెందినా యమగుచిపై 21-13, 22-20 తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. మొదటి సెట్ లో సింధు తన ఆధిపత్యం కొనసాగించింది. రెండో సెట్ లో యమగుచి గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన సెట్ లో ఓ స్థాయిలో ­20-20 కు వచ్చారు. ఈ దశలో సింధు తనదైన ఆట తీరు ప్రదర్శించి సెమీస్ లోకి అడుగుపెట్టింది.

సింధు- యమగుచి ఇప్పటివరకూ 19 మ్యాచ్ లు తలపడగా సింధు 12, యమగుచి 7 మ్యాచ్ లలో విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *