Wednesday, January 22, 2025
Homeసినిమాఎప్పటికీ గుర్తుండిపోయేలా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక

ఎప్పటికీ గుర్తుండిపోయేలా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ కి. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు.అంతే కాదు ఈ ప్రమోషన్స్ ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై తన దైవిక ఆశీర్వాదాలను అందించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని విషయాల గురించి చెప్పాలి అంటే..చరిత్రలో తొలిసారిగా… ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

తిరుపతిలో అయోధ్య భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిపురుష్, రామాయణం పాటలకి ఈ వేడుకలో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు.ఈ ఈవెంట్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ  కార్యక్రమానికి  లక్షకు పైగా అభిమానులు భారీగా తరలి రానున్నారని సమాచారం. మరి.. ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్