Wednesday, June 17, 2026
Homeసినిమా4వ రోజు నుంచి తగ్గుతున్న 'ఆదిపురుష్' జోరు! 

4వ రోజు నుంచి తగ్గుతున్న ‘ఆదిపురుష్’ జోరు! 

‘రామాయణం’ చదవాలనీ .. వినాలని .. సినిమాగా వస్తే చూడాలని చాలామందికి ఉంటుంది. అందువల్లనే ‘రామాయణం’ కథా వస్తువుతో వచ్చిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంతో వచ్చిన సినిమానే ‘ఆదిపురుష్’. టి. సిరీస్ బ్యానర్లో .. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో దిగిపోయింది. ఓం రౌత్ చేసిన మార్పుల కారణంగా వీలైనన్ని విమర్శలను మూటగట్టుకుంటోంది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల వరకూ వసూళ్ల దారి వసూళ్లదే .. విమర్శల దాడి విమర్శలదే అన్నట్టుగా నడిచింది. ఫస్టు డే 140 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ఆ తరువాత రెండు రోజుల పాటు రోజుకి 100 కోట్ల చొప్పున రాబట్టింది. అలా 3 రోజుల్లో 340 కోట్లను వసూలు చేసింది. 4వ రోజున ఒక్కసారిగా 35 కోట్లకు .. 5వ రోజున 20 కోట్లకు వసూళ్లు పడిపోయాయి. ఇలా 5వ రోజునాటికి ఈ సినిమా 395 కోట్లను వసూలు చేసింది. నిజానికి ఈ సినిమా ఈ పాటికి 500 కోట్ల మార్కును టచ్ చేయాలి.

భారీ స్థాయిలో తగ్గుతున్న వసూళ్లను చూస్తుంటే, ఈ సినిమా 500 కోట్ల మార్కును చేరడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పేసి 500 మార్క్ అంటే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టినట్టే అని అర్థం కాదు. ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఇంకా చాలా దూరంలో ఉంది.  ఆ టార్గెట్ ను ఎంతవరకూ చేరుకుంటుందనే విషయంలోనే నమ్మకాలు సడలుతున్నాయి. పాత్రల్లో జీవం లేకపోవడం … సన్నివేశాల్లో ఎమోషన్స్ లేకపోవడం ఇందుకు కారణమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular