Friday, March 13, 2026
HomeసినిమాVenkat Prabhu: 'కస్టడీ డైరెక్టర్' పై ప్రభాస్ ఫ్యాన్స్ నజర్

Venkat Prabhu: ‘కస్టడీ డైరెక్టర్’ పై ప్రభాస్ ఫ్యాన్స్ నజర్

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించారు.  తెలుగు, తమిళ్  భాషల్లో వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే  సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. యావరేజ్ టాక్ వచ్చింది కానీ.. హిట్ టాక్ మాత్రం రాలేదు. శుక్రవారం కంటే శనివారం, ఆదివారం కలెక్షన్స్ ఫరవాలేదనిపించాయి.

వెంకట్ ప్రభుకు ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ డీలాపడ్డారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. నాగచైతన్య సినిమా బాగోకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఏమిటి..? వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా..? అనుకుంటున్నారా..? అలాంటిది ఏమీ లేదు. కాకపోతే వెంకట్ ప్రభు కారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ అలా స్పందిస్తున్నారు.

కారణం ఏంటంటే… ప్రభాస్ సాహో సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఇందుకు కారణం. ట్విట్టర్ వేదికగా సాహో సినిమా ప్లాప్ అవ్వడాన్ని తాను ఆనందిస్తున్నాను అన్నట్లుగా.. తమిళ్ లో రిలీజైన  మరో సినిమా సక్సెస్ అవ్వడం పై హ్యాపీగా ఫీలవుతున్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేశారు. అప్పుడే ప్రభాస్ అభిమానులకు బాగా కోపం వచ్చింది. కర్మ ఎవర్నీ వదలదు అంటూ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు వెంకట్ ప్రభుని ట్రోల్ చేస్తున్నారు. కర్మ ఏమో కానీ.. సోషల్ మీడియా మాత్రం ఎవర్నీ వదలదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular