Sunday, June 14, 2026
Homeసినిమాహను రాఘవపూడితో సెట్స్ పైకి ప్రభాస్! 

హను రాఘవపూడితో సెట్స్ పైకి ప్రభాస్! 

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా తన ప్రభంజనం కొనసాగిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ .. ‘ఆదిపురుష్’ వంటి పాన్ ఇండియా సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అయితే ‘సలార్’ ఆయన అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘కల్కి’ కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ నుంచి రావడానికి ‘రాజా సాబ్’ సినిమా రెడీ అవుతోంది. వినోదమే ప్రధానంగా మారుతి రూపొందిస్తున్న సినిమా ఇది.

ఈ నేపథ్యంలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత అది నిజమేనని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని అంటున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ఈ కథ యుద్ధం నేపథ్యంలో నడవనుందని అంటున్నారు. ‘ఫౌజి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ విజయాలతో ప్రభాస్ దూసుకెళుతున్నాడు. ఇక హను రాఘవపూడి ‘సీతా రామం’తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular