Saturday, January 18, 2025
Homeసినిమాపట్టాలెక్కిన ప్రభాస్ సినిమా!

పట్టాలెక్కిన ప్రభాస్ సినిమా!

ప్రభాస్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రాజా సాబ్’ రెడీ అవుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ దిశగానే ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతోంది. ఈ సినిమా తరువాత హను రాఘవపూడి ప్రాజెక్టుపైకి ప్రభాస్ వెళ్లనున్న విషయం తెలిసిందే. ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్ననే ఈ సినిమా షూటింగు మొదలైపోయిందనేది తాజాగా అందుతున్న సమాచారం.

హను రాఘవపూడి టీమ్ ఇప్పుడు ‘మథురై’ లో ఉంది. నిన్నటి నుంచే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెట్టారు. వారం రోజుల పాటు కీలకమైన కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ కి ప్రభాస్ రాడు. ఆయన కాంబినేషన్ లేని కొన్ని సన్నివేశాలను ఇతర పాత్రలపై ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ‘రాజా సాబ్’కి సంబంధించి తన పోర్షన్ పూర్తయిన తరువాత, ప్రభాస్ ఈ ప్రాజెక్టుపైకి వస్తాడని అంటున్నారు.

ప్రభాస్ ఇంతవరకూ సైన్స్ ఫిక్షన్ .. పౌరాణిక కథలను టచ్ చేశాడు. హను రాఘవపూడితో చేసే సినిమా చారిత్రక నేపథ్యంలో నడుస్తుంది. 1945 కాలానికి సంబంధించిన కథ ఇది. ఆ సమయంలో జరిగిన ఒక యుద్ధం .. అందులో సిపాయిగా ప్రభాస్. ఈ మధ్యలో ఒక అందమైన ప్రేమకథ. ఈ అంశాలను కలుపుకుంటూ ఈ సినిమా సాగుతుంది. ‘ఫౌజీ’  అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మిథున్ చక్రవర్తి కనిపించనున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్