Saturday, January 18, 2025
HomeసినిమాPrabhas: విష్ణు 'భక్త కన్నప్ప'లో ప్రభాస్

Prabhas: విష్ణు ‘భక్త కన్నప్ప’లో ప్రభాస్

సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం భక్త కన్నప్ప. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు..  ప్రభాస్ తో చేయాలి అనుకున్నారు కానీ.. ఈ కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారు. అయితే.. విష్ణు కూడా ఎప్పటి నుంచో భక్త కన్నప్ప సినిమా చేయాలి అనుకుంటున్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమాకి సంబంధించి  ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందేమో అనుకున్నారు. ఊహించని విధంగా విష్ణు ఈ సినిమాను ఇటీవల ప్రారంభించి సర్ ఫ్రైజ్ ఇచ్చారని చెప్పచ్చు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తుంటే… ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై మంచు విష్ణు ట్విట్టర్ లో స్పందించారు. హర హర మహదేవ్ కన్నప్ప అంటూ స్పందించి.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. దీంతో భక్త కన్నప్ప పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రభాస్ ఏ పాత్రలో కనిపించనున్నాడు అంటే.. శివుడు పాత్రలో అని తెలిసింది. ఆదిపురుష్ మూవీలో రాముడు పాత్రలో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు భక్త కన్నప్పలో శివుడు పాత్రలో నటిస్తుండడం విశేషం. దీంతో అభిమానుల్లోనూ కాదు.. ఇండస్ట్రీలోనూ ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది.

న్యూజిలాండ్ లోనే మొత్తం ఈ మూవీ షూటింగ్  చేయాలని ప్లాన్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మిగిలిన భాషలకు చెందిన నటీనటులు కూడా నటించనున్నారని.. చాలా సర్ ఫ్రైజ్ లు ఉన్నాయని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్