Wednesday, June 17, 2026
HomeసినిమాPrabhas: పాన్ ఇండియా సినిమాకి కేరాఫ్ అడ్రెస్ ప్రభాస్!

Prabhas: పాన్ ఇండియా సినిమాకి కేరాఫ్ అడ్రెస్ ప్రభాస్!

ప్రభాస్ .. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఒక మాస్ మంత్రంగా ప్రపంచమంతా వినిపిస్తోంది. ఆయన మార్కెట్ ప్రపంచపటాన్ని ఆక్రమించింది. ‘బాహుబలి’ వరకూ కూడా ప్రభాస్ ఒక సినిమా తరువాత ఒకటిగా తాపీగా చేసుకుంటూ వచ్చాడు. ఆ సినిమా ఆయనను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. బాలీవుడ్ హీరోలతో సమానమైన క్రేజ్ ను ఆయన సొంతం చేసుకోవడం అక్కడి హీరోలను సైతం ఆశ్చర్యపరిచింది. అక్కడి మేకర్స్ ఆయనతో సినిమాలు చేయడం వాళ్లను ఆలోచనలో పడేసింది.

అలా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాను భుజాన వేసుకుని, తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన హీరోగా నిలిచాడు. పాన్ ఇండియా ప్రాజెక్టులు వరుసగా చేస్తూ .. మరో రెండేళ్ల వరకూ  తీరిక  లేకుండా ఉన్నాడు. ఆయనతో బడా నిర్మాతలు భారీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ కి కాస్త మంచితనం పాళ్లు ఎక్కువ. మొహమాటం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అందువలన ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య కాలంలో దెబ్బతిన్నాయి. అయినా ఆయన పట్ల ఆడియన్స్ లో ఎంత మాత్రం క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

ఈ నేపథ్యంలో ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సలార్’ .. ‘కల్కి’ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా పూర్తిగా భిన్నమైనవే. డిఫరెంట్ లుక్స్ తో ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవే. అందువలన వచ్చే ఏడాదిలో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రభాస్ మీడియం బడ్జెట్ సినిమాలు చేయడం లేదనే విమర్శ ఉంది. అలాగే పాన్ ఇండియా సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తుందనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అందువల్లనే ఆయన మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చేస్తున్నాడు. ఈ సినిమాలు ప్రభాస్ కెరియర్లో సంచలన విజయాలను నమోదు చేయాలని కోరుకుంటూ, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తోంది ‘ఐధాత్రి’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular