Saturday, January 18, 2025
Homeసినిమాసిపాయిగా కనిపించనున్న ప్రభాస్! 

సిపాయిగా కనిపించనున్న ప్రభాస్! 

ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘కల్కి’ అభిమానుల అంచనాలను అందుకోగలిగింది. ఈ సినిమా కథ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక బ్లాక్ బస్టర్ పడటం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రాజా సాబ్’ రెడీ అవుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

మారుతి సినిమా తరువాత ‘సలార్ 2’ .. ‘స్పిరిట్’ ప్రాజెక్టులు ప్రభాస్ కోసం వెయిటింగులో ఉన్నాయి. ‘సలార్’ ఫస్టు పార్టు భారీ మాస్ యాక్షన్ సినిమాగా ఆయన అభిమానులను అలరించింది. ఇక సందీప్ వంగా స్టైల్ తెలిసినవారు ‘స్పిరిట్’పై కుతూహలంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో హను రాఘవపూడి ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ‘సీతా రామం’తో ఆయన ఇచ్చిన పెద్ద హిట్ ను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. అలాంటి హను రాఘవపూడి, ప్రభాస్ కి ఒక లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు.

‘సీతారామం’ యుద్ధం నేపథ్యంలో నడిచే ప్రేమకథ .. ఈ సినిమాలో హీరో ఒక సోల్జర్. అలాగే ప్రభాస్ కి వినిపించిన కథ కూడా యుద్ధం నేపథ్యంలో నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణ యువకుడిగా, స్వాతంత్య్రం రాకమునుపు ఆంగ్లేయుల సైనికదళానికి చెందిన సిపాయిగా ప్రభాస్ కనిపిస్తాడని చెబుతున్నారు. అంటే ప్రభాస్ పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయన్న మాట. ఇంతకు ముందు బన్నీ .. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా బ్రాహ్మణ యువకులుగా కనిపించి మెప్పించారు. అయితే అవి కామెడీ కంటెంట్ ఎక్కువున్న సినిమాలు. మరి ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను ఎలా డిజైన్ చేస్తారనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్