Saturday, May 11, 2024
HomeసినిమాPrabhas: హనుకు ప్రభాస్ కండీషన్ పెట్టారా?

Prabhas: హనుకు ప్రభాస్ కండీషన్ పెట్టారా?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ తో జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత సలార్ సెప్టెంబబర్ 28న విడుదల కానుంది. సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కే’ రానుంది. ఇలా ఆరు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ శారు. నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా ‘ప్రాజెక్ట్ కే ‘తర్వాత మారుతితో చేస్తున్న హర్రర్ కామెడీ మూవీని వచ్చే ఏడాది  సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నెక్ట్స్ మూవీస్ కోసం ప్రభాస్ కథలు వింటున్నాడట. ‘సీతారామం’ తో బ్లాక్ బస్టర్ సాధించిన హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడట. ఆ కథను ప్రభాస్ కు చెబితే చాలా బాగుంది చేద్దామని మాట ఇచ్చాడట. అయితే.. దీనికి ఓ కండీషన్ పెట్టాడట. ఏంటా కండీషన్ అంటే.. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయాలని… మొత్తం సీన్ టు సీన్ పేపరు మీద వచ్చిన తర్వాత మరోసారి కథ గురించి చర్చిద్దామని చెప్పాడట.

ప్రభాస్ అలా చెప్పడంతో హను రాఘవపూడి ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని తెలిసింది. తెలుగు తెరపై ఇప్పటి వరకు రాని కొత్త పాయింట్ తో ఈ కథ ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ కాంబో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలిసింది. ఇప్పటికే హీరో ప్రభాస్ కు, డైరెక్టర్ హను రాఘవపూడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారని టాక్ వినిపిస్తుంది. స్టోరీ లాక్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారట. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ లో అనౌన్స్ మెంట్ రానుందని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్