Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ స్లిమ్ కు కారణం తెలుసా?

ప్ర‌భాస్ స్లిమ్ కు కారణం తెలుసా?

Slim Purush:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఇటీవ‌ల ప్ర‌భాస్ ఆదిపురుష్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ఇంటికి వెళ్లారు. ఆ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో ప్ర‌భాస్ చాలా స్లిమ్ గా.. చాలా అందంగా కనిపించారు. దీంతో ప్ర‌భాస్ స‌డ‌న్ గా స్లిమ్ గా అవ్వ‌డానికి కార‌ణం ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ స‌లార్ ఫుటేజ్ ని చూసిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ ని ప‌ది కేజులు త‌గ్గాల‌ని చెప్పాడ‌ట‌. అలా త‌గ్గిన త‌ర్వాతే స‌లార్ షూటింగ్ స్టార్ట్ చేద్దామ‌ని చెప్పాడ‌ట‌. అప్ప‌టి నుంచి ప్ర‌భాస్ అదే ప‌నిలో ఉన్నాడ‌ట‌. చివ‌ర‌కి ప్ర‌శాంత్ నీల్ చెప్పిన‌ట్టుగా 10 కేజీలు త‌గ్గి చాలా స్లిమ్ గా క‌నిపిస్తున్నాడు. డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు స‌లార్ షూటింగ్ కంప్లీట్ చేయాల‌నేది టార్గెట్ గా పెట్టుకున్నార‌ని స‌మాచారం.

వ‌చ్చే స‌మ్మ‌ర్ లో స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్రాజెక్ట్ కే విష‌యానికి వ‌స్తే.. స‌లార్ పూర్తి చేసిన త‌ర్వాత నుంచి ప్రాజెక్ట్ కే పై ఎక్కువ‌ దృష్టి పెట్ట‌బోతున్నారు. ఇది పాన్ వ‌ర‌ల్డ్ మూవీ. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ చిత్రాల‌తో నిరాశ‌ప‌రిచిన ప్ర‌భాస్.. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌ని అభిమానులు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

Also Read : ప్ర‌భాస్ స‌లార్ వ‌చ్చేది ఎప్పుడు..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్