Tuesday, June 9, 2026
HomeTrending Newsకిడాంబి, జాఫ్రిన్ లకు సిఎం అభినందనలు

కిడాంబి, జాఫ్రిన్ లకు సిఎం అభినందనలు

Keep it! భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సచివాలయంలో ఈ ఇద్దరు క్రీడాకారులు సిఎం జగన్‌ను కలుసుకున్నారు.

ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను  జగన్ ప్రశంసించారు.  బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌–2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్‌ను జగన్‌ కొనియాడారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనితో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని , రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సిఎం ఆకాక్షించారు.

ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున  సీఎం  జగన్‌కు బ్యాడ్మింటన్‌ కిట్‌ ను ఏపీబీఏ ప్రెసిడెంట్‌ ముక్కాల ద్వారకానాథ్‌ అందజేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ, షేక్‌ జాఫ్రిన్‌ తండ్రి షేక్‌ జకీర్‌ అహ్మద్, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్, శాప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular