10.1 C
New York
Friday, December 1, 2023

Buy now

Homeసినిమారెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్

రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి రియాక్షన్

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటించిన ప్రగతి గురించి గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రగతి త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని, వరుడు కూడా దొరికేసాడని పలు మీడియా వెబ్‌ సైట్‌లు రాసుకొచ్చాయి.కాగా తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది.

‘ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇది బాధ్యత రాహిత్యమే అవుతుంది. నేను ఒక నటిని కాబట్టి మీరు ఏమైనా రాయవచ్చని అనుకోవడం తప్పు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు రాయడానికి మీకేం హక్కు ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు? ఇదంతా ఎవరైనా కలగన్నారా? ఎవరి కలలోకైనా ఈ వార్త వచ్చిందా? నేను దీన్ని ఖండిస్తున్నాను. ఒకరి గురించి రాసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని ఆధారాలు ఉంటే రాయండి. అలాంటి విషయం ఏదైనా ఉంటే నేనే చెబుతాను కదా! ఇది చాలా చీప్‌. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. ఇక నుంచి అయినా బాధ్యతతో ఉండండి. ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌, జర్నలిజం ఎథిక్స్‌ అనేవి ఉంటాయి కదా. ఇది అన్‌ ప్రొఫెషనల్‌, అన్‌ ఎథికల్‌, వెరీ ఇర్రెస్పాన్సిబుల్‌. ఇకపై ఇలా చేయకండి..’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్