ఫిడే ప్రపంచ కప్ చెస్-2023లో రన్నరప్ గా నిలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేష్ బాబుకు ఘన స్వాగతం లభించింది. అజర్ బైజాన్ లోని బాకులో జూలై 30 నుంచి ఆగస్ట్ 24 వరకూ జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద ఫైనల్స్ కు చేరుకొని… వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు, నార్వే కు చెందిన మాగ్నస్ కార్ల్ సేన్ తో తలపడిన సంగతి తెలిసిందే. రెండు క్లాసికల్ గేమ్స్ ను డ్రాగా ముగించి, ట్రై బ్రేకర్ లో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచాడు.
ఈ ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానందకు అపూర్వ స్వాగతం లభించింది. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు లభించిన ఆదరణ పట్ల ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు, ‘నాకు చాలా సంతోషంగా ఉంది, భారత చెస్ కు కూడా ఇవి మంచి రోజులు’ అంటూ వ్యాఖ్యానించాడు.