ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ము, ధైర్యముంటే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో లీటర్ పెట్రోలుపై వ్యాట్ పేరుతో రూ.30లు దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలు పెట్రోలు ధరల తగ్గింపుపై ఆందోళన చేయడం సిగ్గు చేటన్నారు. 9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిరిపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర రామన్నపేటలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బండి సంజయ్ అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
మీరు రాముడి వారసులైతే… బిజెపికి ఓటు వేయండి. పాస్ పోర్టు ల బ్రోకర్ కేసీఆర్. పాస్ పోర్టు ల దందా చేసి జైలుకు పోయిండు. కేసీఆర్ కి వయసు మీద పడ్డది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిండు. పెట్రోల్ ధరలు తగ్గించమనడానికి కేసీఆర్ కు సిగ్గుండాలి. పెట్రోల్ పై లీటర్ కు రూ.30 కమిషన్ దొబ్బుతుండు. కర్ణాటక లో తెలంగాణ లో కంటే రూ. 13లు తక్కువగా దొరుకుతుంది.తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే డీజిల్ కొట్టించుకుని రావాలని ఆదేశాలు ఇచ్చారు.
ధర్మారెడ్డి కాలువ పనులను పూర్తి చేయలేదు. రామన్నపేటలో పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి.. అందులో డాక్టర్లు మాత్రం లేరు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కుక్కకు ఉన్న విలువ కూడా రామన్నపేట ప్రజలకు లేదు. చంద్రబాబుతో కుమ్మక్కై 68 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న కృష్ణా జలాల్లో… తెలంగాణ కు హక్కుగా రావాల్సిన 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కొడుకు, కూతురు పాల్గొన్నారా? మొబైల్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిన ఘనత కేసీఆర్ కూతురు కవిత దే. హరీష్ రావు కు పెట్రోల్ దొరుకుద్ధి కానీ, అగ్గిపెట్టె దొరకదు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎంతమందికి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాడు? తెలంగాణకు మోడీ 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేశారు.
చేనేత బీమా, ఇంటికో ఉద్యోగం, లక్ష రుణమాఫీ, దళితులకు 3 ఎకరాలు, దళితబంధు హామీ ఏమైంది? రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది బీజేపీ నే. కేసీఆర్ వరి వేసి కోటీశ్వరుడు అయ్యాడు… రైతులను బికారీలను చేసిండు. 200 కి.మీల దూరంలోనున్న తన ఫార్మ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు. ఇక్కడ 700 కోట్లు ఖర్చు చేస్తే… ధర్మారెడ్డిపల్లె, బునాదిగాని, పిలాయిపల్లి కాలువలు పూర్తి అవుతాయి. అవి పూర్తి చేయడు
రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని ఓడించేందుకు కాంగ్రెస్తో చేతులు కలిపాడు కేసీఆర్. రామన్నపేటలో రైళ్ల ను ఆపేవిధంగా కేంద్రంతో మాట్లాడుతా. రైల్వే జీఎం కు ఫోన్ చేసి మాట్లాడితే…రైళ్లను ఆపేవిషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దరఖాస్తు చేసాడని చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైల్లో పెడతారు. కేసీఆర్ అంటే… ఖాసీం చంద్రశేఖర్ రజ్వి. కేటీఆర్ అంటే సయ్యద్ మక్బుల్. కేసీఆర్ షాప్ లు(బెల్ట్ షాప్ లు, లిక్కర్, వైన్) ఉన్నాయా ఇక్కడ అని ప్రజలను అడిగి సమాధానం రాబట్టిన బండి సంజయ్.
కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తాడు. ఆ తర్వాత ఆ హామీలను విస్మరిస్తాడు. బిజెపికి ఓట్లు వేయకున్నా కూడా కేంద్రం నుంచి నకిరేకల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో నిధులను మంజూరు చేశాం.కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో నేను చెబుతున్న లెక్కలు తప్పయితే… నా మీద కేసులు పెట్టుకోండి. టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.
Also Read : చీకటి దందాలకు కేరాఫ్ తెరాస ; బండి సంజయ్