Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజా సంగ్రామ యాత్ర, టీఆరెస్ ను గద్దెదించే యాత్ర

ప్రజా సంగ్రామ యాత్ర, టీఆరెస్ ను గద్దెదించే యాత్ర

తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాలని, తెలంగాణ లో నిజాం పాలన పోవాలని భాగ్యలక్ష్మి అమ్మను కోరుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో అన్నారు. బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షులు  బండిసంజయ్  చేపట్టిన  మహా సంగ్రామయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఊరు-ఊరు వాడ వాడ బండి సంజయ్ యాత్రకు సహకరించాలని కోరారు. టీఆరెస్ పార్టీ గద్దె దించే యాత్ర- ప్రజా సంగ్రామ యాత్ర అన్న కేంద్ర మంత్రి బీసీలకు రాజకీయంగా- సామాజికంగా టీఆరెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులు- యువతకు టీఆరెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని రోజులు రాబోతున్నాయన్నారు.

బంగారు తెలంగాణ కాలేదు- కానీ కేసీఆర్ కుటుంబం బంగారం అయిందన్న కిషన్ రెడ్డి, కేసీఆర్- ఎంఐఎం రెండు కుటుంబాలు తెలంగాణను ఎళుతున్నాయని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినంగా జరుపుతారా లేదా? స్పష్టత ఇవ్వాలని సిఎం ను డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం అడ్డుకుంటే- కేసీఆర్ వాళ్లకు వంతపడుతున్నారని, పాతనగరం అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటోందన్నారు. MMTS సెకండ్ ఫేజ్ రాకపోవడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు.

హుజురాబాద్ లో బీజేపీ- ఈటెలను ఓడించేందుకు కేసీఆర్ నిద్ర పోవడం లేదని, బీజేపీ పాదయాత్ర స్టార్ట్ అవుతోంది- కేసీఆర్ సీఎం కుర్చీ కదిలే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. సెక్రటేరియట్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్ కు తెల్వదన్నారు. 12వందల మంది బలిదానాల తెలంగాణను ఎంఐఎం చేతుల్లో కెసిఆర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్