Friday, April 19, 2024
HomeTrending Newsరేవంత్ బాగోతం త్వరలో బయట పెడతా – మల్లారెడ్డి

రేవంత్ బాగోతం త్వరలో బయట పెడతా – మల్లారెడ్డి

రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూశా ..తుస్సు మనిపించాడని, నా సవాల్ పై వెనక్కి పోయాడని మంత్రి మల్లా రెడ్డి ఎద్దేవా చేశారు. నా పై ఆరోపణలన్నీ అబద్దాలే అన్నారు. నకిలీ కాగితాలతో ఆధారాలున్నాయని నమ్మించేందుకు రేవంత్ ప్రయత్నించాడన్నారు. టి ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలిసి మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచం లో ఎక్కడెక్కడి కాగితాలో తెచ్చి చూపాడని, జవహర్ నగర్ లో 330 ఎకరాల ప్రభుత్వ స్థలం లో ఇళ్ళు కట్టుకున్న వారికి ,ప్లాట్లు ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కెసిఆర్ దే అన్నారు.

2016 లో జీవో తెచ్చి వాటిని క్రమబద్దీకరించారని, జవహర్ నగర్ లో నా కోడలి పేరు మీద ఉంది ఐదెకరాలు కాదని 350 గజాలే అని మంత్రి వెల్లడించారు. నిబంధనల ప్రకారం అక్కడ ఆస్పత్రి కట్టి పేదలకు సేవ చేస్తున్నానని, నన్ను టీడీపీ ఎంపీ గా ఉన్నప్పటినుంచే రేవంత్ ఇబ్బంది పెడుతున్నాడని మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను చంద్రబాబు దృష్టికి తెచ్చాను. నా మెడికల్ కాలేజీ ల పై కూడా రేవంత్ mci కు పిర్యాదు చేశాడు. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది నా లాంటి పెద్ద మనిషి ని వేధించడానికా అని మల్లారెడ్డి ప్రశ్నించారు.

పార్లమెంట్ లో నా కాలేజీ ల పై రేవంత్ ప్రశ్న వేస్తె కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందని పీసీసీ ని రేవంత్ సర్కస్ కంపెనీ గా మార్చాడని మల్లారెడ్డి విమర్శించారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కొంత మంది ని బక్రాలను చేసి రేవంత్ వసూళ్లు చేస్తున్నాడని, ఎవరెవరు రేవంత్ కు ఎంత ఇచ్చారో నా దగ్గర వివరాలు ఉన్నాయన్నారు.

ఎమ్మెల్యే సీతక్క ను రేవంత్ పక్కదారి పట్టిస్తున్నాడని, నాకు 600 ఎకరాల కు పైగా ఉంది ..ఇందులో 400 ఎకరాల్లో కాలేజీలు ఉన్నాయి ..వాటికి రైతు బంధు ఎలా వస్తుందని మంత్రి ప్రశ్నించారు. కావాలంటే ఆన్ లైన్ లో చూసుకోవచ్చన్నారు. గుండ్ల పోచంపల్లి లో శ్రీనివాస్ రెడ్డి పదహారు ఎకరాలకు సంబంధించి 1989 లోనే పాస్ బుక్ వచ్చిందని, నాకు శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ డీడ్ ఇచ్చినా ఆ స్థలం నా యూనివర్సిటీ కాంపౌండ్ లోనే లేదన్నారు.

రేవంత్ ఖబడ్ధార్ ..రేపట్నుంచి పిచ్చి ఆరోపణలు మానుకో అని మంత్రి హితవు పలికారు. నేను చేసిన సవాల్ లోకి సీఎం కెసిఆర్ ను ఎందుకు లాగుతావన్నారు. నీ స్థాయి కి నేను చాలని, దమ్ముంటే హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ సాధించి పెట్టు అని రేవంత్ కు సవాల్ విసిరారు. రేవంత్ బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్ త్వర లో బయట పెడుతా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్