Tuesday, March 10, 2026
Homeసినిమా‘మా’ బరిలో ప్రకాష్‌ రాజ్

‘మా’ బరిలో ప్రకాష్‌ రాజ్

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి రసవత్తర పోటీకి రంగం సిద్ధమౌతుంది. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు గతంలో ఎంత పోటాపోటీగా జరిగాయో తెలిసిందే. రాబోయే ఎన్నికలు కూడా ఆసక్తిగా మారాయని చెప్పచ్చు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈసారి మా ఎన్నికల్లో అధ్యక్షుడుగా పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ‘మా ‘ఎన్నికల్లో తను పోటీ చేయనున్నట్లు ధ్రువీకరించారు ప్రకాష్ రాజ్.

చిరంజీవి మద్దతు మీకు ఉంటుందని అనుకోచ్చా..? మీరేమంటారు అని అడిగితే.. చిరంజీవి అందరి వ్యక్తి. మంచి చేస్తారని భావించిన వారికి మద్దతు ఇస్తారు. అయితే… అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీనికి ఉపయోగించుకోను అని ప్రకాష్ రాజ్ చెప్పారు. అలాగే తనకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహన ఉందని.. తనకు అవకాశం ఇస్తే.. దేశంలోనే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కు గౌరవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు ‘మా’ కు సొంత భవనం లేకపోవడం దురదృష్టకరం. తాను అధ్యక్షుడిని అయితే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంతం భవనం నిర్మిస్తాను. ఇది ఖచ్చితంగా చేసి తీరతాను అని ప్రకాష్‌ రాజ్ చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఈసారి మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని కలిసిన తర్వాత మంచు విష్ణు అనౌన్స్ చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. నిజంగానే మంచు విష్ణు పోటీ చేస్తారా..? లేక వేరే ఎవరైనా పోటీకి సై అంటారా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular