Saturday, January 18, 2025
Homeసినిమా'నరసింహపురం' బృందానికి ప్రకాష్ రాజ్ ప్రశంసలు

‘నరసింహపురం’ బృందానికి ప్రకాష్ రాజ్ ప్రశంసలు

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై..  పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’ చిత్ర బృందాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోనా ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి “నరసింహపురం” చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శక నిర్మాతలను ఎంతైనా అభినందించాలనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే “నరసింహపురం” వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, చెల్లెలు పాత్రధారి  ఉష, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ బళ్లా, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సినిమాటోగ్రఫర్ కర్ణ ప్యారసాని, ప్రముఖ నటుడు సమీర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్