Friday, March 29, 2024
HomeTrending News'మా'కు గుడ్ బై : అతిథిగానే ఉంటా: ప్రకాష్ రాజ్

‘మా’కు గుడ్ బై : అతిథిగానే ఉంటా: ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్నటి ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన అయన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ నేడు మీడియా ముందుకు వచ్చారు. తెలుగువాళ్ళు మాత్రమే అసోసియేషన్ కు నాయకత్వం వహించాలని సభ్యులందరూ భావించారని, అందుకే ఒక తెలుగు బిడ్డను ఎన్నుకున్నారని, దాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కళాకారుడిగా తనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుందని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  తన తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాకపోవడం తన తప్పు కాదని, వాళ్ల తప్పుకూడా కాదని భావోద్వేగంతో చెప్పారు.

తనకు-ప్రేక్షకులకు, దర్శకులకు, రచయితలకు, నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుందని వెల్లడించారు. అతిథిగా వస్తే అతిథిగానే ఉండాలంటూ తన తోటి కళాకారులు రవిబాబు, కోట శ్రీనివాసరావు, పెద్దలు మోహన్ బాబు గార్లు చెప్పినట్లు తాను అతిథిగానే ఉంటానన్నారు.

తెలుగు వాడిని కానందున, ప్రాంతీయత, జాతీయవాదం అంశాలు తెరమీదకు తెచ్చినందువల్ల, ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరిగినందున తాను ఓటమి పాలైనట్లు అభిప్రాయపడ్డారు. తెలుగువాడు కాని వ్యక్తి  ఓటు వేయవచ్చు కానీ నిలబదకూదదన్న అంశాన్ని కూడా తెరమీదకు తెచ్చారని, దీనికోసం బై లాస్ కూడా మారుస్తామని వారు చెప్పారని ప్రకాష్ గుర్తు చేశారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా జాతీయవాదం గెలిచిందంటూ ట్వీట్ చేశారని చెప్పారు.  ‘మా’ అంతా ఒకే కుటుంబమన్న అబద్ధాన్ని నమ్మనని వ్యాఖ్యానించారు. ఓటమిని జీర్ణించుకున్నాను కాబట్టే  రాజీనామా చేస్తున్నానని, తీర్పును గౌరవిస్తున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్