టోక్యోలో జరుగుతోన్న బి.డబ్ల్యూ.ఎఫ్. వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన మ్యాచ్ లో మనదేశానికే చెందిన ఆటగాడు, ఇటీవల ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్య సేన్ పై 17-21; 21-16,21-17 తో విజయం సాధించాడు.
పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల ద్వయం 18-21; 21-15; 21-16తేడాతో సింగపూర్ జోడీపై ….. మరో మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-12, 21-10తో డెన్మార్క్ ఆటగాళ్ళపై గెలుపొండి క్వార్టర్స్ లోకి ప్రవేశించారు.
కాగా, మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ చేతిలో 21-17;16-21; 21-13 తో ఓటమి పాలైంది.
Also Read : ప్రీ క్వార్టర్స్ లో లక్ష్య సేన్-ప్రణయ్ పోరు