Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Malaysia Masters: ఫైనల్లో ప్రణయ్; ఓటమి పాలైన సింధు

Malaysia Masters: ఫైనల్లో ప్రణయ్; ఓటమి పాలైన సింధు

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా మాస్టర్స్-2023లో భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ ఫైనల్లో ప్రవేశించాడు. కాగా మహిళల సింగిల్స్ లో పివి సింధు సెమీస్ లో ఓటమి పాలైంది.

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్- ఇండోనేషియా ఆటగాడు క్రిస్టియన్ అడినత మధ్య తొలి సెమీఫైనల్ జరిగింది.  మొదటి సెట్ లో ప్రణయ్ 19-17తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అడినత గాయం కారణంగా వైదొలిగాడు. దీనితో ప్రణయ్ టైటిల్ రేసులో నిలిచాడు.

కాగా, ఇండోనేషియా ప్లేయర్ జార్జియా మరిశ్క చేతిలో 21-14; 21-17 తేడాతో సింధు ఓటమి పాలై కాంస్యం పతకం దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్