బి డబ్ల్యూ ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2023లో హెచ్ ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్లో ప్రవేశించాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు, డెన్మార్క్ కు చెందిన విక్టర్ ఆక్సెల్ సన్ పై 13-21; 21-15; 21-16 తేడాతో విజయం సాధించి ఈ మెగా టోర్నీలో ఒక మెడల్ ఖాయం చేశాడు. తొలి సెట్ కోల్పోయినా పట్టు విడవకుండా తర్వాతి రెండు సెట్ లలో మంచి ప్రతిభ కనబరిచి గెలుపు సొంతం చేసుకున్నాడు/
పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ లు ఓటమి పాలయ్యారు. వీరిపై డెన్మార్క్ ద్వయం కిమ్ ఆస్ట్రప్-అండర్స్ స్కారూప్ లు 21-18; 21-19 తో గెలుపొందారు.