Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ టైటిల్! 

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ టైటిల్! 

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. ఇది చాలా పవర్ ఫుల్ టైటిల్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక మరో వైపున ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, ‘దేవర’తో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువకానున్నాడు. ఆ వెంటనే అక్కడ ‘వార్ 2’ ఆయన క్రేజ్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కూడా అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్లో గానీ .. నవంబర్ లో గాని సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ఎంచుకునే కథలు .. ఆయన డిజైన్ చేసే హీరో పాత్రలు ఎలా ఉంటాయనేది తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ కోసం ఆయన ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. ఈ కథలో ఎన్టీఆర్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది.

ఈ సినిమా కోసం ‘డ్రాగన్’ అనే టైటిల్ ను లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చునని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. కథానాయికలుగా రష్మిక .. కీర్తి సురేశ్ పేర్ల తెరపైకి వచ్చాయి. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు? లేదంటే మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా? అనేది చూడాలి. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘సలార్ 2 ‘ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టుపైకి వస్తాడన్నమాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్