Sunday, January 19, 2025
Homeసినిమాస‌లార్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్న ప్ర‌శాంత్ నీల్?

స‌లార్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్న ప్ర‌శాంత్ నీల్?

Some Changes: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ స‌లార్. కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రమైన స‌లార్ పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో సలార్ సినిమాలో ప్రభాస్ ను ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయబోతున్నారనే క్లారిటీ వ‌చ్చింది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే.. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ప్రభాస్ చిత్రాన్ని వాయిదా వేసి.. ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్ 2 చిత్రాన్ని అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యింది కాబ‌ట్టి ఇప్పుడు స‌లార్ చిత్రాన్ని వెంట‌నే సెట్స్ మీదకు తీసుకెళ్లతారు అనుకున్నారు.

అయితే.. ఈ సినిమా రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉందని టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే.. కేజీఎఫ్ 2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సలార్ చిత్రం పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ప్రశాంత్ మళ్లీ సలార్ స్క్రిప్ట్ పై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ మూవీ టీజ‌ర్ ను ఈ నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : స‌లార్ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్