Sunday, March 8, 2026
HomeTrending Newsవైఎస్ జగన్ గా ‘ప్రతీక్ గాంధీ’

వైఎస్ జగన్ గా ‘ప్రతీక్ గాంధీ’

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ ‘యాత్ర’ అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వై.ఎస్ పాత్రను మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి పోషించారు. ఆయన వైఎస్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో యాత్ర 2 తెరకెక్కించనున్నట్టుగా దర్శకుడు మహి వి రాఘవ అప్పట్లో ప్రకటించారు.

‘యాత్ర 2’ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కథాంశంగా రూపొందించనున్నట్లు తెలియచేశారు. అయితే.. వైఎస్ జగన్ పాత్రలో నాగార్జున నటించనున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు తాజా వార్త ఏంటంటే..  వైఎస్ జగన్‌గా బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ కనిపించబోతున్నట్టు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. మరి.. మహి వి రాఘవ ‘యాత్ర 2’ తో కూడా సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular