Saturday, January 18, 2025
Homeసినిమా2025 దాకా ఖాళీలేని ప్రభాస్!

2025 దాకా ఖాళీలేని ప్రభాస్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజు, ఇమేజు అమాంతం పెరిగింది. దేశవిదేశాల్లో ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బడా దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్‌, సలార్ చిత్రాలు చేస్తున్నారు. సలార్ చిత్రాన్ని 2022 సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఆదిపురుష్‌ మూవీని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేయనున్న సినిమాని ఈ సంవత్సరం చివరిలో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ సినిమాని 2022 చివరికి పూర్తి చేయాలనేది ప్లాన్. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని సమాచారం. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో సినిమా చేయనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.

ఈ చిత్రం 2024 లో ప్రారంభమవుతుంది. వీటితో పాటు మరి కొన్ని కథాచర్చలు జరుగుతున్నాయని.. అందుచేత 2025 వరకు డేట్స్ ఖాళీ లేవని చెబుతున్నారట ప్రభాస్. అయినప్పటికీ కొంత మంది దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ ని సంప్రదిస్తున్నారట. ఒకవేళ ఎవరైనా మంచి కథతో మెప్పించినా.. 2025 వరకు వెయిట్ చేయాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్