Tuesday, June 16, 2026
Homeసినిమాసెప్టెంబర్ 2న ‘ప్రేమదేశపు యువరాణి’ రిలీజ్‌

సెప్టెంబర్ 2న ‘ప్రేమదేశపు యువరాణి’ రిలీజ్‌

పవన్‌కళ్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని ‘మసకతడి’ పాట విడుదల కాగా, ‘నిశబ్దం’ అంటూ సాగేమరో పాటను ఆవిష్కరించారు. జనసేన పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ రాయపాటి అరుణ పాట విడుదల చేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపి సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.  అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను సునీత ఆలపించారు. దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం.  సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదల చేస్తున్నారు.

 సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ “ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. రాయపాటి అరుణ గారు లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular