Friday, November 22, 2024
HomeTrending Newsఆఫ్ఘన్ పౌరులకు కొత్త పాస్ పోర్టులు

ఆఫ్ఘన్ పౌరులకు కొత్త పాస్ పోర్టులు

ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు కొత్త పాస్ పోర్టులు, జాతీయ గుర్తింపు కార్డుల జారీకి సన్నాహాలు మొదలయ్యాయి. తొందరలోనే జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తాలిబాన్ మంత్రివర్గం ప్రకటించింది. కాబుల్ ఆక్రమించుకొని తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాస్ పోర్టు జారీ నిలిపివేశారు. దాదాపు రెండు నెలల నుంచి విదేశాలకు వెళ్ళే వారు, విద్య, వైద్యం, ఉద్యోగాలు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు పాస్ పోర్టుల గడువు తేది ముగిసి కొత్త వాటి కోసం స్వదేశానికి వచ్చి మారిన రాజకీయ పరిణామాలతో ఇక్కడే చిక్కుకు పోయారు.

పాకిస్తాన్, ఇరాన్ దేశాలకు వైద్యం కోసం వెళ్ళే వారు పాస్ పోర్టుల గడువు ముగిసి పోవటంతో పెద్ద మొత్తంలో అమెరికన్ డాలర్లు లంచాలుగా చెల్లించి ఎదో విధంగా సరిహద్దులు దాటుతున్నారు. పాత ప్రభుత్వ జాడలు లేకుండా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో తొందరలోనే కొత్త పాస్ పోర్టులు జారీ చేయనున్నారు. ఎప్పటి నుంచి జారీ చేస్తారో తేది ఇంకా ప్రకటించలేదు, దీంతో ఆఫ్ఘన్ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాబుల్ లో ప్రజలు నిత్యం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్