Thursday, May 8, 2025
HomeTrending Newsఢిల్లీలో లాక్ డౌన్ కు సన్నాహాలు

ఢిల్లీలో లాక్ డౌన్ కు సన్నాహాలు

Preparations For Lockdown In Delhi :

వాయు కాలుష్యం తగ్గించేందుకు పరిష్కారంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో మాత్రమే లాక్ డౌన్ విధించడం పరిమితమైన ప్రభావాన్ని చూపిస్తుందని కేజ్రీవాల్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంకు సమర్పించిన ప్రమాణ పత్రం(అఫిడవిట్‌)లో పేర్కొంది. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆంక్షలు అవసరమని పేర్కొంది.  భారత ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ద్వారా ఈ చర్యను నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR) పరిసర ప్రాంతాల్లో తప్పనిసరి చేస్తే తగిన ఫలితం ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ పిటిషన్ విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.

ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వారం రోజుల పాటు.. వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలు జరిగే ప్రాంతాలన్నీ కూడా మూడు రోజుల పాటు బంద్ చేయాలని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.

Also Read :  ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్